Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోమేషన్ విధానంతో వచ్చే ఐదేళ్ళలో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులకు ఎసరు!

వచ్చే ఐదేళ్ళ (2021 నాటికి)లో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులను ఆయా కంపెనీలు కొలువుల నుంచి తొలగించనున్నాయి. ఈ మేరకు హెచ్‌ఎఫ్‌ఎస్ రీసెర్చ్‌ ఓ సర్వేలో వెల్లడించింది. ఈ కొలువుల తొలగింపు కూడా ఎక్కడో కాదు..

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (13:17 IST)
వచ్చే ఐదేళ్ళ (2021 నాటికి)లో 6.40 లక్షల ఐటీ ఉద్యోగులను ఆయా కంపెనీలు కొలువుల నుంచి తొలగించనున్నాయి. ఈ మేరకు హెచ్‌ఎఫ్‌ఎస్ రీసెర్చ్‌ ఓ సర్వేలో వెల్లడించింది. ఈ కొలువుల తొలగింపు కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే కావడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆటోమిషన్ విధానమే.
 
ఫలితంగా రాబోయే ఐదేళ్లలో భారత ఐటీ రంగంలో ఆరున్నర లక్షల ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగించే అవకాశం ఉందని హెచ్‌ఎఫ్‌ఎస్ రీసెర్చ్‌ విశ్లేషించింది. దానికితోడు ఆటోమేషన్‌ విస్తరణ బిపీఓ పరిశ్రమల్లో గుబులు రేపుతోంది. ఐటి పరిశ్రమలోని 1477 స్టాక్‌ హోల్డర్స్‌ను కలిసి హెచ్‌ఎఫ్‌ఎస్‌ ఈ సర్వే నిర్వహించింది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఐటి పరిశ్రమలో నికరంగా 9 శాతం లేదా 14 లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని హెచ్‌ఎఫ్‌ఎస్‌ హెచ్చరించింది. ఈ పరిస్థితి ఫిలిప్పీన్స్‌, యూకే, అమెరికా వంటి అనేక దేశాల్లోనూ ఉంటుందని పేర్కొంది.
 
ఇప్పటికే చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదని తేలిపోయింది. టెక్‌ మహింద్రా గతేడాది ప్రారంభించిన ఆటోమేషన్‌ డ్రైవ్‌లో భాగంగా… రెండు వేల ఉద్యోగాలకు  ఉద్వాసన పలికింది. ఇకపై అసెంచర్‌ సంస్థ తక్కువమంది ఉద్యోగులను తీసుకోనుందని ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. టీసీఎస్‌ కొత్తగా తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య కూడా అదే విషయం వెల్లడిస్తోంది. అలాగే, ఆటోమేషన్‌పై ఐటి ఉద్యోగుల్లో భయాలు మొదలయ్యాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తం దేశ ఆటోమేషన్ విధానం ఐటీ పరిశ్రమకే ఇది పెద్ద సవాల్‌గా మారనుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments