Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టెక్కీ స్వాతి గొంతు కోయలేదు... అరటి గెలలు కోసుకునే నిరుపేద... రామ్ కుమార్ న్యాయవాది

చెన్నై టెక్కీ స్వాతిని గొంతు కోసి హతమార్చడంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న రామ్ కుమార్ మారుమూల పల్లెలో అరటి గెలలు, కందగడ్డలు కోసుకుంటూ బతికే నిరుపేద కుటుంబానికి చెందినవాడనీ, అతడు స్వాతి గొంతును కోసి హత్య చేయలేదని, పోలీసులు అమయాకుడిని అరెస్టు చేసి తీస

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (13:15 IST)
చెన్నై టెక్కీ స్వాతిని గొంతు కోసి హతమార్చడంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న రామ్ కుమార్ మారుమూల పల్లెలో అరటి గెలలు, కందగడ్డలు కోసుకుంటూ బతికే నిరుపేద కుటుంబానికి చెందినవాడనీ, అతడు స్వాతి గొంతును కోసి హత్య చేయలేదని, పోలీసులు అమయాకుడిని అరెస్టు చేసి తీసుకువచ్చారని రామ్ కుమార్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టులో పిటీషన్ వేశారు. స్వాతిని హత్య చేసిన వ్యక్తిని ప్రత్యక్ష సాక్షి గుర్తుపట్టలేదనీ, గుర్తు తెలియని వ్యక్తి అని అతడు చెప్పినా... పోలీసులు మాత్రం అమాయకుడైన రామ్ కుమార్ ను పట్టుకొచ్చారన్నారు. 
 
మద్రాస్ హైకోర్టు నిందితుడిని రెండు రోజుల్లో బోనులో నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన చెన్నై పోలీసులు హుటాహుటిన రామ్ కుమార్ ను అరెస్టు చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు... అతడు మాట్లాడకుండా పోలీసులే రామ్ కుమార్ గొంతు కోసేసి ఇక్కడికి తీసుకొచ్చారన్న అనుమానాలు కూడా ఉన్నాయంటూ న్యాయవాది కృష్ణమూర్తి పిటీషన్లో పేర్కొంటూ రామ్ కుమార్ కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటీషన్ న్యాయమూర్తి జయచంద్రన్ ఎదుటకు రానుంది.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments