Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీ-ఇమేజిన్డ్ చేయబడిన సరికొత్త ఎకో ఫ్యామిలీ ఆవిష్కారం, మీ ఇంట్లో సందడే సందడి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (23:03 IST)
అమెజాన్ బెంగళూరులో తన సరికొత్త శ్రేణికి చెందిన ఎకో ఉపకరణాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇవి సరికొత్త డిజైన్లు, మెరుగుపర్చబడిన ఆడియో, మరింత శక్తివంతమైన హార్డ్వేర్‌లతో రూపుదిద్దుకున్నాయి.
 
ఈ రోజు ప్రకటించిన కొత్త ఎకో పరికరాలు:
ఎకో డాట్: స్ఫుటమైన, ఫుల్ సౌండ్ మరియు శక్తివంతమైన బాస్ ఉత్పత్తి చేయడానికి కొత్త గోళాకార రూపకల్పనతో అత్యంత ప్రజాదరణ పొందిన ఎకో పరికరం రూ.4,499
 
గడియారంతో ఎకో డాట్: ఎల్‌ఈడీ డిస్‌ప్లే, కొత్త గోళాకార డిజైన్ మరియు ఇప్పుడు అదనంగా నీలిరంగుతో అత్యధికంగా అమ్ముడవుతున్న స్పీకర్‌ రూ. 5,499.
 
ఎకో: ఎకో, ఎకో ప్లస్ అత్యుత్తమాలు ఒకే ఉపకరణంలో కలసిపోయాయి. నూతన గోళాకార రూపకల్పన, డాల్బీ స్టీరియో సౌండ్, స్మార్ట్ హోమ్ సెట్-అప్‌ను సరళీకృతం చేయడానికి అంతర్నిర్మిత జిగ్ బీ హబ్‌ రూ. 9,999
 
ఈ సందర్భంగా అమెజాన్ డివైజెస్ (ఇండియా) హెడ్ పరాగ్ గుప్తా మాట్లాడుతూ, ‘‘మా కొనుగోలుదారుల జీవితాలను సరళం చేయడంలో అంతర్భాగంగా కీలకపాత్ర పోషిస్తున్నాయి ఎకో ఉపకరణాలు. మాటల సౌలభ్యంతో వారు తమ అభిమాన సంగీతం కోసం, స్మార్ట్ హోమ్ అప్లియెన్స్‌ల నియంత్రణం కోసం లేదా కుటుంబంతో సరదాగా గడిపేందుకు వారు అలెక్సాను అడగవచ్చు’’ అని అన్నారు.
 
‘‘నూతన శ్రేణికి చెందిన ఎకో ఉపకరణాలతో మేము వినియోగ దారులకు అలెక్సాతో ఇంటరాక్ట్ కావడాన్ని మరింత సహజమైందిగా, సౌలభ్యవంతమైందిగా చేస్తున్నాం. నూతన శ్రేణి ఎకో స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభూతిని అందించేలా పూర్తిగా రీడిజైన్ చేయబడ్డాయి. ఇవి మీ ఇంటి అలంకరణలో మిళితమైపోతాయి. ఇవి ఇప్పటివరకూ వచ్చిన మా ఉత్పాదనల్లో మరింత సుస్థిరదాయకమైనవి అనే విషయాన్ని మీతో పంచుకోవడం మాకెంతో గర్వకారణం’’ అని అన్నారు.
 
నూతన ఎకో-నూతన గోళాకార డిజైన్, డాల్బీ స్టీరియో సౌండ్ మరియు బిల్టిన్ జిగ్ బీ హబ్
నూతన తరం ఎకో అనేది ఎకో మరియు ఎకో ప్లస్ రెండింటి విశిష్టతలను ఒకే ఉపకరణంలోకి తీసుకువచ్చింది. అదే సమయంలో అందుబాటు ఎకో ధరలోనే ఇది లభిస్తుంది. దీని సరికొత్త డిజైన్ మరియు ఫ్యాబ్రిక్ ఫినిష్ దాన్ని ఎక్కడ అమర్చినా ఎంతో గొప్పగా కనిపిస్తాయి. గోళాకారపు అడుగు భాగంలో ప్రకాశవంతమైన ఎల్ఈడీ కాంతి వలయం ఉంటుంది. మరింత విజిబిలిటీ కోసం ఉపరితలాలపై అది ప్రతిఫలిస్తుంది.
 
నూతన ఎకో మరెన్నో అంశాల్లో మరింత మెరుగ్గా ఉంటుంది. 3.0 అంగుళాల వూఫర్, డ్యూయల్ ఫిర్లింగ్ ట్వీటర్లు మరియు డాల్బీ ప్రాసెసింగ్ ఇందులో ఉన్నాయి. ఇది క్లియర్ హైలు, డైనమిక్ మిడ్స్, డీప్ బాస్‌తో స్టీరియో సౌండ్‌ను అందిస్తుంది. ఎకో స్టూడియోతో, నూతన ఎకో ఆటోమేటిక్‌గా మీ స్పేస్ యొక్క అకౌస్టిక్స్‌ను గుర్తిస్తుంది. అందుకు తగ్గట్టుగ్గా ఆడియో ప్లే బ్యాక్‌ను ఫైన్ ట్యూన్ చేస్తుంది.
 
మీ అభిమాన సంగీతం కోసం అడిగితే చాలు.... చక్కటి సంగీతం ఆటోమేటిక్‌గా మీ రూమ్‌లో వినిపిస్తుంది. మొదటిసారిగా ఎకో అంతర్ నిర్మిత జిగ్ బీ స్మార్ట్ హోమ్ హబ్‌తో వస్తోంది. ఇది శక్తిని ఆదా చేసే బ్లూ టూత్‌లో ఎనర్జీ(బీఎల్ఈ)ని సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త విశిష్టతలు, సాంకేతికతలతో కూడిన ఎకో వెల రూ.9,999 మాత్రమే.
 
ఎకో డాట్ & ఎకో డాట్ విత్ క్లాక్- నూతన గోళాకార డిజైన్లు మరియు క్రిస్ప్, ఫుల్ సౌండ్
కొనుగోలుదారులు ఎకో డాట్‌ను ఇప్పటికే అత్యుత్తమంగా విక్రయమయ్యే స్పీకర్‌గా చేశారు. ఇప్పుడది మరింత మెరుగుపడింది. సరికొత్త ఎకో డాట్ అనేది ఎకో మాదిరి గోళాకార డిజైన్‌ను, ఫ్యాబ్రిక్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఏ స్పేస్ లోనైనా అలెక్సాను జోడించేందుకు మరింత స్టయిలిష్ మార్గంగా చేసింది. చూసేందుకు కాంపాక్ట్ గానే ఉన్నా శక్తివంతమైన 1.6 అంగుళాల ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్‌ను కలిగిఉంటుంది. క్రిస్ప్ వోకల్స్ అందిస్తుంది.
 
మీరు మీ ఇంట్లో ఏ గదిలో వినాలనుకున్నా కూడా బ్యాలెన్స్‌డ్ బాస్‌ను అందిస్తుంది. నూతన ఎకో డాట్ విత్ క్లాక్ అనేది నూతన ఎకో డాట్ తరహా మెరుగుదలలతోనే వస్తుంది, అదనంగా ఒక ఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దాంతో మీరు సమయం, బయటి ఉష్ణోగ్రత, టైమర్స్, అలారమ్స్ వంటివి తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు కొనుగోలుదారులు ఇష్టపడే ట్యాప్ టు స్నూజ్ ఫీచర్ కూడా. ఎకో డాట్ విత్ క్లాక్ అనేది ఎకో డాట్ మరియు ఎకో రెండింటిలోనూ లభ్యమవుతుంది.
 
సుస్థిరదాయకత పట్ల కట్టుబాటు
నేడు ఆవిష్కరించిన ఉపకరణాలన్నీ కూడా 100 శాతం పోస్ట్- కన్జ్యూమర్ రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్, 100 శాతం రీసైకిల్డ్ డైకాస్ట్ అల్యూమినియం మరియు పోస్ట్ కన్జ్యూమర్ రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారయ్యాయి. అంతేగాకుండా ఎకో ఉపకరణం ప్యాకేజింగ్‌లో ఉపయోగించిన ఉడ్ ఫైబర్ ఆధారిత పదార్థాలన్నీ కూడా బాధ్యతాయుతంగా పెంచే అడవులు లేదా రీ-సైకిల్డ్ వనరుల నుంచి సేకరించబడినవే. సుస్థిరదాయక మెటీరియల్స్ ఉపయోగించడంతో పాటుగా ఈ ఎకో ఉపకరణాలన్నీ కూడా ఇన్‌యాక్టివిటీ సమయంలో- లో పవర్ మోడ్ ద్వారా శక్తిని ఆదా చేస్తాయి. ఉపకరణం జీవితకాలం అంతా కూడా శక్తి ఆదాలను అందిస్తాయి. 
 
ఎకో డాట్ (రూ.4,999), ఎకో (రూ.9,999) నలుపు, తెలుపు, నీలి రంగుల్లో లభ్యమవుతాయి. ఎకో డాట్ విత్ క్లాక్ (రూ.5,499) తెలుపు మరియు నీలి రంగుల్లో లభ్యం.
ఈ రోజు నుంచి ఎకో డాట్ ప్రి-ఆర్డర్ పై లభ్యం. ఈ ఏడాది చివర్లో షిప్పింగ్ ప్రారంభమవుతుంది. ఎకో మరియు ఎకో డాట్ విత్ క్లాక్ కొనుగోళ్లకు లభ్యమయ్యే సమయం తెలుసుకునేందుకు నోటిఫైడ్ పై సైనప్ చేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments