జూలై 21, మధ్యాహ్నం 12 గంటలకు.. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ ఫోన్ 4 ప్లస్ వచ్చేస్తోంది..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (16:47 IST)
Infinix
ఇన్‌ఫీనిక్స్ బడ్జెట్ ఫోన్ త్వరలో భారత్‌లో రానుంది. జూలై 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను లాంఛ్ చేయనున్నట్లు ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయిన ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్‌4కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
 
జూన్ నెల ప్రారంభంలో ఈ ఫోన్ గూగుల్ కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఇందులో హెచ్‌డీ‌డిస్ ప్లేను అందించనున్నారు. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3జీబీ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు తెలియరాలేదు.
 
ఇన్‌ఫీనిక్స్ సంస్థకు చెందిన ఫేస్ బుక్, ట్వీటర్ పేజీల్లో మాత్రం ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ అనే పేరును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ బ్యానర్‌లో జులై 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అని పేర్కొన్నారు. అయితే దీని బ్యాటరీ మాత్రం చాలా పెద్దది అని సూచించేలాగా #FullPower24Hr అనే హ్యాష్ ట్యాగ్‌ను ఉపయోగించారు.
 
ఈ టీజర్ ప్రకారం చూస్తే ఇందులో పెద్ద స్క్రీన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లేను అందించనున్నారని మాత్రం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరాను నాచ్‌లోనే అందించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments