భారత్-జపాన్‌ల మధ్య కీలక ఒప్పందం.. 5జీ టెక్నాలజీపై డీల్..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:48 IST)
5G technology
భారత్-జపాన్‌ల మధ్య కీలక ఒప్పందం ఖరారైంది. 5జీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందం కీలకం కానుంది. చైనా టెలీకమ్యూనికేషన్​ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచవ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్​ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
డిజిటల్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని గుర్తించి భారత్, జపాన్ విదేశాంగ మంత్రులు.. సైబర్ సెక్యూరిటీ ఒప్పందాన్ని అంగీకరించారు. చైనా టెలీకమ్యూనికేషన్​ దిగ్గజం హువావే 5జీ సేవలపై ప్రపంచ వ్యాప్తంగా విముఖత కనిపిస్తున్న నేపథ్యంలో భారత్-జపాన్​ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
సంక్లిష్ట సమాచార వ్యవస్థ, 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, అభివృద్ధి, భద్రత వంటి రంగాల్లో ఇరు దేశాల సహకారం ఈ ఒప్పందంతో మరింత పెరుగుతుందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ తెలిపింది.
 
ఈ సమావేశంలో భాగంగా సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, మౌలిక వసతులు, కనెక్టివిటీ, ఐరాసలో సంస్కరణలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments