Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్-ఆపిల్

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (15:52 IST)
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఆపిల్ ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్స్ సేల్స్ వివరాలను వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఆపిల్ ఇఫోన్ తాజాగా వాటి అమ్మకాల వివరాలను తెలిపింది. ఐఫోన్ 11 అమ్మకాలతో ఉత్సాహంగా ఉన్న ఆపిల్, అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలం ఐఫోన్ మోడల్స్ భారతదేశంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.
 
"బ్రెజిల్, చైనా, ఇండియా, థాయిలాండ్, టర్కీ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు రెండు అంకెలు వృద్ది పెరిగిందని" అని టిమ్  కుక్  తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ మోడళ్ల ద్వారా వచ్చిన ఆదాయం 56 బిలియన్ డాలర్లు.
 
"ఇది ఒక సంవత్సరం క్రితం కంటే 8 శాతం ఎక్కువ, ఐఫోన్ 11 ధర 63,900, ఐఫోన్ 11 ప్రో ధర 96,900, ఐఫోన్ 11 ప్రో మాక్స్ కోసం ఉన్న డిమాండ్‌కి మా కృతజ్ఞతలు. డిసెంబర్ త్రైమాసికంలో ప్రతి వారంలో ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ అత్యధికంగా అమ్ముడైన మోడల్, ఈ మూడు కొత్త మోడళ్లు అత్యంత పోపులరిటీ పొందిన ఐఫోన్‌లు" అని  టిమ్ కుక్ తెలిపాడు.
 
ఆపిల్ మాక్, ఐప్యాడ్ ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలో 7.2 బిలియన్ల ఆదాయాన్ని తెచ్చాయి."ఐప్యాడ్ కోసం మెక్సికో, ఇండియా, టర్కీ, పోలాండ్, థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మంచి వృద్ధి చూపించింది" అని కుక్ చెప్పారు.
 
ఇదిలా వుండగా, ఆపిల్ తన హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సమయంలో హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ప్రాడక్ట్ పేజీని కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించింది. భారతదేశంలో హోమ్‌పాడ్ ధర రూ. 19,990. కానీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments