Webdunia - Bharat's app for daily news and videos

Install App

1జీబీ ధరకే 15జీబీ డేటా.. కానీ ఫ్లిప్ కార్ట్‌‌లో మొబైల్ కొంటేనే...?

ఉచిత డేటా పేరిట.. జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో 4జీ వినియోగ‌దారుల కోసం మొబైల్ నెట్‌వ‌ర్క్ దిగ్గ‌జం ఐడియా అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 1జీబీ ధ‌ర‌కే 15 జీబీ డేటాను అందిస్తున్న‌ట్టు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (09:05 IST)
ఉచిత డేటా పేరిట.. జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో 4జీ వినియోగ‌దారుల కోసం మొబైల్ నెట్‌వ‌ర్క్ దిగ్గ‌జం ఐడియా అద్భుత‌మైన ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. 1జీబీ ధ‌ర‌కే 15 జీబీ డేటాను అందిస్తున్న‌ట్టు ఐడియా ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ పొందేందుకు చిన్న షరతు విధించింది. ఈ-కామ‌ర్స్ దిగ్గజం.. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని మెలిక పెట్టింది. 
 
మార్చి 31వ తేదీలోపు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనుగోలు చేసిన అంద‌రికీ ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఐడియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్యాక్‌ను మార్చి 31లోపు మూడుసార్లు వినియోగించుకునే వీలుంది. ఇకపోతే.. కొత్త సిమ్‌కు అప్ గ్రేడ్ అయ్యే ఐడియా ఖాతాదారులు కూడా సరికొత్త ఆఫర్‌ను వినియోగించుకోవచ్చునని ఐడియా తెలిపింది. 
 
ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది. ఫ్లిప్‌కార్టులో మొబైల్ కొన్న త‌ర్వాత తొలుత 1జీబీ డేటా ప్యాక్ వేసుకోవడం ద్వారా ఈ ఆఫ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. మిగిలిన 14 జీబీని అద‌న‌పు డేటాగా ఉప‌యోగించుకోవ‌చ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments