5జీతో కరోనా విస్తరించిందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారు..?

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (10:08 IST)
5జీతో కరోనా వైరస్ విస్తరించిందని వార్తలు వస్తున్నాయి. 5జీ టెక్నాలజీతోనే కరోనా వైరస్‌ను తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  
 
అయితే 5జీ టెక్నాలజీని తొలిసారిగా పరీక్షించి చూసిన చైనాలోని వుహాన్‌ పట్టణానికి, అక్కడే కరోనా పుట్టడానికి సంబంధం ఉందని ప్రచారం చేయడంలో వాస్తవం లేదు.
 
2019, ఏప్రిల్‌ మూడవ తేదీన 5జీ టెక్నాలజీని దక్షిణ కొరియాలోని సియోల్‌ నగరంలో ఎస్‌కే టెలికామ్‌ ఆవిష్కరించగా, అంతకుముందే 2018, డిసెంబర్‌ నెలలోనే తాము కనుగొన్నట్లు అమెరికా టెలికామ్‌ కంపెనీలు ప్రకటించాయి. చాలా దేశాల్లో కరోనా వైరస్‌ పుట్టకముందే 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే 5జీ కారణంతో కరోనా విస్తరించిందని ఆధారాల్లేని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కానీ ఆమ్‌స్టర్‌డామ్‌ యూనివర్శిటీలో ‘న్యూమీడియా డిజిటల్‌ కల్చర్‌’లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న మార్క్‌ టూటర్స్, యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో అమెరికన్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న పీటర్‌ నైట్, న్యూకాజల్‌ యూనివర్శిటీలో డిజిటల్‌ బిజినెస్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోన్న వాసిమ్‌ అహ్మద్‌ సహా పలువురు నిపుణులు కరోనాకు 5జీ టెక్నాలజీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. 
 
కాగా.. వైరస్ అనుకోకుండా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విడుదల చేసిందని, లేదా దీనిని ఉద్దేశపూర్వకంగా బయోవార్ఫేర్ ఆయుధంగా తయారు చేసినట్లు, చైనీస్ లేదా అమెరికన్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments