Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న కరోనా, భక్తులూ జాగ్రత్త

చిత్తూరు జిల్లాను వణికిస్తున్న కరోనా, భక్తులూ జాగ్రత్త
, బుధవారం, 17 జూన్ 2020 (23:51 IST)
చిత్తూరుజిల్లాను కరోనా వణికిస్తోంది. 401పాజిటివ్ కేసులు జిల్లావ్యాప్తంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 48పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తిలో 10పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాంటాక్ట్ కేసులే చిత్తూరుజిల్లాలో ఎక్కువగా కనబడుతున్నాయి. 
 
తమిళనాడు రాష్ట్రానికి దగ్గరలో చిత్తూరుజిల్లా ఉండడం..ఆ ప్రాంతం నుంచి కొంతమంది ప్రజలు చిత్తూరుజిల్లాకు రావడంతో కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకుతున్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా గ్రామాల నుంచి దొడ్డిదారిని కొంతమంది చిత్తూరుజిల్లాలోకి ప్రవేశిస్తున్నారు.
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా లక్షణాలతో రావడం..చిత్తూరుజిల్లాలోకి ప్రవేశించిన తరువాత టెస్ట్ లు చేసుకోవడంతో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కాంటాక్ట్ కేసులే ఎక్కువ జిల్లా వాసులను భయపెడుతున్నాయి. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారు స్థానికులకు కరోనాను అంటిస్తున్నారని..ఇలా వ్యాపిస్తోందని కూడా ప్రభుత్వం నిర్థారణకు వచ్చింది. 
 
ఇప్పటికే ఆలయాలను తెరవడంతో పాటు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులతో భక్తులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. దీంతో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. అయితే జిల్లాలో కరోనాను పట్టించుకోకుండా జనం మాస్క్ లు సరిగ్గా దరించకుండా, గ్లౌజ్ లను వేసుకోకుండా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్థిరంగా ఉన్న మార్కెట్లు; 9900 మార్క్ కన్నా దిగువన నిఫ్టీ