Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపాడ్‌ వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌... రాఖీ పౌర్ణమికి స్టిక్కర్స్

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (14:23 IST)
వాట్సాప్‌లో ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది వాట్సాప్. తాజాగా రాఖీ పౌర్ణమి నేపథ్యంలో కొత్త స్టిక్కర్స్ తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' లేకుండా ప్రతీ రోజు కొందరికి జీవనం ఉండబోదని అనేలా యూజ్ చేస్తున్నారు. ఇకపోతే 'రక్షా బంధన్' వంటి ప్రాముఖ్యత కలిగిన పండుగ నేపథ్యంలో స్టిక్కర్స్ తీసుకురావడం పట్ల వాట్సాప్ యూజర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. 
 
ఈ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకొని చెల్లెలు అన్నయ్యకు, అక్కలు తమ్ముళ్లకు 'రాఖీ స్టిక్కర్స్' పంపించుకోవచ్చు. ఈ రాఖీ స్టిక్కర్లను అసలు వాట్సాప్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునేందుకుగాను గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ 'రక్షా బంధన్ వాట్సాప్ స్టిక్కర్స్' అని సెర్చ్ చేస్తే స్టిక్కర్ యాప్‌లు మీకు అక్కడ మెన్షన్ అవుతాయి.
 
అలా మెన్షన్ అయిన వాటిల్లో మీకు నచ్చిన రక్షా బంధన్ స్టిక్కర్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఓపెన్ యచేసి మనకు ఇష్టమైన రాఖీ స్టిక్కర్ లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత యాడ్ టు వాట్సాప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు.. వెంటనే స్టిక్కర్ ప్యాక్ మీ వాట్సాప్‌లో యాడ్ అయిపోతుంది. ఎమోజీ సింబల్స్‌పై క్లిక్ చేసి మీకు కావాల్సిన వారికి స్టిక్కర్స్‌ను పంపించుకోవచ్చు.
 
ఇకపోతే.. ఐపాడ్‌ యూజర్లకు వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ను ఐపాడ్‌ యూజర్లు వినియోగించేలా డిజైన్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. 2019 నుంచి మల్టీ డివైజ్‌ 2.0 పేరుతో మల్టీ డివైజ్‌ ఆప్షన్‌పై వర్క్‌ చేస్తున్న వాట్సాప్‌..ఈ ఏడాదిలో ఊహించని విధంగా ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందించింది.
 
అయితే తాజాగా ఈ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ను ఐపాడ్‌లలో కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ 'వాట్సాప్‌ బీటా' వివరాల ఆధారంగా.. యూజర్లు వాట్సాప్‌ను ఫోన్‌తో పాటు వాట్సాప్‌ వెబ్‌, పోర్టల్‌, డెస్క్‌ ట్యాప్‌, ఫోన్‌ లో వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఐపాడ్‌ లో కూడా అందుబాటులోకి రానుంది.
 
అంతేకాదు వాట్సాప్‌ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్‌ ఛార్జింగ్‌ దిగిపోయి డెడ్‌ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. కాగా భవిష్యత్‌లో ఐపాడ్‌ కాకుండా ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్లలో మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ ను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments