Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాఫియా డాన్ నుంచి తప్పించుకునేందుకే పెళ్లి చేసుకున్నా : రాఖీ సావంత్

Advertiesment
మాఫియా డాన్ నుంచి తప్పించుకునేందుకే పెళ్లి చేసుకున్నా : రాఖీ సావంత్
, ఆదివారం, 16 మే 2021 (18:27 IST)
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బ్రిటన్‌కు చెందిన రితేశ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇలా ఆకస్మికంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. గుజరాత్‌కు చెందిన ఓ మాఫియా డాన్‌ను తప్పించుకునేందుకు పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి ప్రస్తావన తెచ్చారు. తాను ఆకస్మికంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో వివరించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మాఫియా డాన్ బారి నుంచి తప్పించుకునేందుకే రితేశ్‌ను పెళ్లాడానని రాఖీ తెలిపింది. పరమ కర్కోటకుడైన ఆ డాన్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడని వివరించింది. మరొకరిని పెళ్లి చేసుకుంటే అతడు తన జోలికి రాకుండా ఉంటాడని రితేశ్‌తో జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యానని రాఖీ పేర్కొంది.
 
'ఆ వ్యక్తితో కలిసి గోవాలో డేటింగ్‌కు వెళ్లాను. ఈ సందర్భంగా ఓ భయంకరమైన వీడియో నా కంటపడింది. తన ఫాంహౌస్‌లో ఓ వ్యక్తిని అతడు చావగొడుతుండటం ఆ వీడియోలో చూశాను. అప్పట్నించి అతడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, అతడేమో కిడ్నాప్ చేసైనా పెళ్లి చేసుకుంటా అని బెదిరించేవాడు. ఆ సమయంలోనే రితేశ్ పరిచయమయ్యాడు. తనకో మంచి వరుడ్ని చూసిపెట్టమని అతడ్నే అడిగాను. రితేశ్ సరేనన్నాడు. చివరికి రితేశ్‌నే పెళ్లి చేసుకున్నాను. ఆ విధంగా మాఫియా డాన్ ముప్పు తొలగిపోయింది" అని రాఖీ వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధన్య బాలకృష్ణ మద్యం సేవించిందా?