Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ : ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు!

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (11:13 IST)
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే క్రియేటర్లు తాము చేసే పోస్టుల ఆధారంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కలిపించనుంది ఇన్‌స్టాగ్రామ్‌. ట్విట్టర్‌ తీసుకొచ్చిన సూపర్‌ ఫాలో ఫీచర్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీస్‌ అనే ఫీచర్‌ను తీసుకొస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లు నెట్టింట సందడి చేస్తున్నాయి. 
 
అయితే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి క్రియేటర్‌ బ్యాడ్జ్ సాధించిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాగే వీరు పోస్ట్ చేసే స్టోరీలను కూడా అందరూ చూడలేరు. డబ్బులు చెల్లించి మెంబర్‌ షిప్‌ తీసుకున్న వారు మాత్రమే ఈ కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పించారు. అయితే మొదట్లో ఈ సేవలను ఉచితంగా అందించినా తర్వాత డబ్బులు వసూలు చేస్తారు. 
 
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక క్రియేటర్స్‌ పోస్ట్‌ చేసే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను స్క్రీన్‌ షాట్‌లను తీసుకునే అవకాశం ఉండదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments