Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సూపర్ రికార్డు: రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులతో..?

సంచలనాలకు కేంద్రంగా మారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న జియో తాజాగా ఐదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించింది. జియో

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (11:51 IST)
సంచలనాలకు కేంద్రంగా మారిన రిలయన్స్ జియో టెలికాం మరో ఘనతను సాధించింది. ఉచిత కాలింగ్, ఉచిత డేటా ఆఫర్లతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న జియో తాజాగా ఐదు కోట్ల ఖాతాదారుల మైలురాయిని అధిగమించింది. జియో లాంచ్ చేసిన తర్వాత కేవలం మూడు నెలల్లోనే 83 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఖాతాదారులను నమోదు చేసింది. 
 
మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్‌కు 50 మిలియన్ల ఖాతాదారుల మైలు రాయిని దాటడానికి 12 ఏళ్లు పడితే, వొడాఫోన్, ఐడియాకు 13 సంవత్సరాలు పట్టిందని లెక్కలు చెప్పారు. అతివేగంగా వృద్ధి చెందుతున్న సంస్థగా రిలయన్స జియో ఇన్ఫోకామ్ నిలిచిందని తెలిపారు. అయితే 85 రోజుల్లోనే 50 మిలియన్ల ఖాతాదారులను జియో సొంతం చేసుకుంది. 
 
రోజుకు సగటున ఆరు లక్షల ఖాతాదారులను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, స్కైప్‌లను మించిన ఆదరణ పొందుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలో అతి పెద్ద డిజిటల్ సేవలు అందిస్తున్న ఏకైక సంస్థగా అవతరించిందని పేర్కొన్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments