Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడిని బయటకు పంపి గర్ల్‌ఫ్రెండుతో అన్న శ్రుంగారం... చలి పులి తట్టుకోలేక అన్నను హత్య..

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట తనను బయటకు పంపి, గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్నాడన్న కోపంతో సొంత అన్నను డంబెల్‌తో కొట్టి చంపేశాడు. హత్య చేస

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:35 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట తనను బయటకు పంపి, గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తున్నాడన్న కోపంతో సొంత అన్నను డంబెల్‌తో కొట్టి చంపేశాడు. హత్య చేసింది ఎవరో కాదు పీజీ విద్యార్థి. ఢిల్లీలో జరిగిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే.. 
 
మహారాష్ట్రలోని ఝాన్సీకి చెందిన తనను బయటకు ఎందుకు పంపుతున్నావంటూ ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న హిమాంశు వర్మ (23) తన అన్న హితేష్ (28)తో గొడవ పడ్డాడు. రాత్రిపూట చలిలో తాను బయట ఉండలేనని అన్నాడు. ఆ విషయమై ఇద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో కోపంతో డంబెల్ తీసుకుని అన్నమీద విసిరేశాడు. 
 
అంతేకాక అతడు చనిపోయేవరకు దాంతో కొట్టాడు. బాధితుడు హితేష్ ఓ కాలేజిలో సంస్కృతం చెబుతుంటాడు. రాత్రి 1.30 గంటల సమయంలో అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చి, హిమాంశును బయటకు వెళ్లమని చెప్పాడు. ప్రతి రెండు రోజులకోసారి అతడు అలాగే చేస్తున్నాడని హిమాంశు పోలీసులకు చెప్పాడు. 
 
ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటంతో తనకు కోపం వచ్చిందని, ఆ చలిలో బయటకు వెళ్లడానికి తాను నిరాకరించానని అన్నాడు. అన్నను చంపిన తర్వాత తానే పోలీసులకు రాత్రి 3 గంటల సమయంలో ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన అన్నను చంపారని కట్టుకథ అల్లాడు. చంపడానికి ఉపయోగించిన డంబెల్‌ను మంచం కింద దాచేశాడు. అయితే పోలీసులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం వెల్లడించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments