Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌- పాన్ కార్డు అనుసంధానం.. సెప్టెంబర్ 30వరకు గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (23:00 IST)
ఆధార్‌- పాన్ కార్డు అనుసంధానం ఇంకా పూర్తి చేయని వారికి గుడ్ న్యూస్. ఆధార్‌- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన ఈ అనుసంధాన ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది.
 
అలాగే సొంతింటిపై పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపును మూడు నెలలకు పైగా పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. అలాగే వివాద్‌ సే విశ్వాస్ చెల్లింపుల పథకాన్ని రెండు నెలలు పొడిగించింది. 
 
కరోనా చికిత్స పొందిన వారికి, మరణించిన వారికి పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒక ఉద్యోగికి యాజమాన్యం చెల్లించిన కొవిడ్ వైద్య చికిత్స మొత్తంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments