Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో పెళ్లికి భర్త రెడీ.. అంతే నరికి చంపేసిన భార్య.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (22:49 IST)
మూడో పెళ్లి చేసుకోబోయిన భర్తను హతమార్చింది.. ఓ భార్య. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్ నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో నివసించే మత పెద్ద అహ్మద్(57)కు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. 
 
ఇటీవల మూడో పెళ్లి చేసుకోవటానికి ఉబలాట పడుతూ ఆ విషయాన్ని తన ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో ముగ్గురి మధ్య గతకొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రోజులాగే గురువారం రాత్రి కూడా మూడో పెళ్లి విషయమై ఇంట్లో గొడవ జరిగింది. ఈ క్రమంలో అహ్మద్ మొదటి భార్య హజ్రాను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ముగ్గురూ నిద్రపోయారు. 
 
భర్త కొట్టిన విషయం మనసులో పెట్టుకున్న హజ్రా, అహ్మద్ నిద్రిస్తుండగా ఇంట్లో కూరగాయల కోసం ఉపయోగించే కత్తితో అహ్మద్ మర్మాంగాలను తీవ్రంగా గాయపరిచింది. ఆ కత్తిపోట్లకు తీవ్ర రక్తసావ్రమైన అహ్మద్ ప్రాణాలు విడిచాడు. అయితే స్థానికుల సమాచారం మేరకు భౌరన్ కలాన్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు.
 
పోలీసులు విచారణ చేపట్టటంతో హజ్రా నేరం ఒప్పుకుంది. ఇద్దరు భార్యల మధ్యే రోజూ గొడవలు జరుగుతూ ఉంటే, మూడో భార్యను తీసుకువస్తాననే సరికి కోపం పట్టలేక ఆవేశంలో హత్యచేశానని తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments