Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 370మంది మహిళలను.. అలా నగ్నంగా..?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (22:32 IST)
సోషల్ మీడియా ఎంత మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ కున్నంత డిమాండ్ మరి వేటికీ లేదంటే అతిశయోక్తికాదు. బహుళ ప్రాచుర్యం పొందిన వాట్సప్ ద్వారా మహిళలకు నగ్నంగా వీడియో కాల్ చేసి వేధించాడో కీచకుడు. ఒకటి రెండూ కాదు ఏకంగా 370 మంది మహిళలను టార్చర్ చేశాడు. చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు.
 
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన 35 ఏళ్ల శివకుమార్ వర్మ అనే వ్యక్తి గర్హ్వార్ పోలీసు స్టేషన్ పరిధిలో స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నాడు. అతను మహిళలను లైంగికంగా వేధించేవాడు. ఇందుకోసం అతను 7 మొబైల్ ఫోన్లు ఉపయోగించాడు. ప్రతి సారీ ఒక కొత్త సిమ్ కార్డు ఉపయోగించి మహిళలను వేధించేవాడు. అనంతరం ఆ సిమ్ కార్డును నాశనం చేసేవాడు.
 
మహిళల నెంబర్లు తెలుసుకోటానికి మొబైల్ కీ ప్యాడ్ పై ఇష్టం వచ్చినట్లు 10 నెంబర్లు టైప్ చేసేవాడు. ఆ నెంబర్లు ట్రూ కాలర్లో చెక్ చేసేవాడు. అందులో మహిళల పేర్లు వస్తే ఆ పేరు సేవ్ చేసుకుని వారికి వాట్సప్ వీడియో కాల్ చేసేవాడు. వాట్సప్ వీడియో కాల్ చేసేటప్పుడు ఫోన్ స్క్రీన్ రికార్డ్ మోడ్ లో ఉంచి…తాను వారి ముందు నగ్నంగా ఉండేవాడు.
 
ఇది గమనించిన మహిళలు వెంటనే కాల్ కట్ చేసేవారు. అప్పటికే స్క్రీన్ రికార్డింగ్ మోడ్‌లో ఉండటంతో వీడియో రికార్డయ్యేది. ఆ వీడియోను మహిళలకు పంపించి వారిని లైంగికంగా వేధించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తే.. తన వద్ద వున్న స్క్రీన్ రికార్డింగ్ వీడియోలను వారి భర్తలకు, బంధువులకు పంపుతానని బెదిరించేవాడు.
 
ఈ రకంగా వర్మ యూపీలోని 15 జిల్లాలకు చెందిన 370 మంది మహిళలను వేధింపులకు గురిచేశాడు. కాగా ఫిబ్రవరి 2020లో లక్నోకి చెందిన ఒక మహిళ వర్మకు వ్యతిరేకంగా 1090 నెంబర్‌కు ఫిర్యాదు చేసింది.
 
పోలీసులు పలుమార్లు అతడిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసేవారు. అయినా అతడిలో మార్పురాలేదు. మళ్లీ తన పాత పంథానే కొనసాగించసాగాడు. ఈనేపధ్యంలో అతని ప్రవర్తన మారకపోవటంతో ఇటీవల పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వర్మను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం