Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, మధ్యాహ్నం భోజనంపై గూగుల్ కోత

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (17:24 IST)
సాధారణంగా ఉద్యోగులకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చే విషయంలో గూగుల్ సంస్థ ఎల్లవేళలా ముందు వరుసలో ఉంటుంది. కానీ, కంపెనీపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యల్లో భాగంగా, చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, మధ్యాహ్న భోజనం వటి వాటిని ఆపేయాలని గూగుల్ నిర్ణయించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది., ఈ మేరకు కంపెనీ ప్రధాన ఆర్థిక అధికారి రుత్‌ పోరట్‌ ఉద్యోగులకు లేఖ రాశారు.
 
మరోవైపు ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్‌ పేర్కొన్నారు. ప్రాధాన్యానికి అనుగుణంగా.. ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
ల్యాప్‌టాప్‌ల కొనుగోలును సైతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే గూగుల్‌ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఇటీవలే 12,000 మందిని ఇంటికి పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments