Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హ‌లో ఎవ‌రు?

hellow evaru poster
, బుధవారం, 15 మార్చి 2023 (15:47 IST)
hellow evaru poster
తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం 'హ‌లో ఎవ‌రు?.  ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం - హీరోయిన్ సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు జరుపుకుంటోంది.
 
ఈ క్రైం ఆండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. మే నెల‌లో 'హ‌లో ఎవ‌రు?' చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురేష్ బాబు విడుదల చేసిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లుక్