త్వరలో ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ బుకింగ్‌.. గూగుల్ పే

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (23:09 IST)
గూగుల్ పే త్వరలో ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను (ఎఫ్‌డీ) బుకింగ్‌ చేసుకునే వీలును  కల్పించనుంది. భాగస్వామి ఫిన్‌టెక్ ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. 
 
గూగుల్ పే ద్వారా ఎఫ్‌డీలను బుక్ చేసుకునేందుకు తమ వినియోగదారులను అనుమతించడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లను (ఏపీఐ) అందించడంలో ప్రత్యేకత కలిగిన ఫిన్‌టెక్ సేతుతో గూగుల్ జతకట్టింది.
 
దీంతో గూగుల్‌ పే వినియోగదారులు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలను ఒక ఏడాది వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ఎఫ్‌డీలకు పొందే గరిష్ట వడ్డీ రేటు 6.35 శాతంగా ఉండనున్నది. అయితే, ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు వన్‌ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా ఆధార్ ఆధారిత కేవైసీని పూర్తిచేయాల్సి ఉంటుంది.
 
ఏపీఐ బీటా వెర్షన్ 7-29 రోజులు, 30-45 రోజులు, 46-90 రోజులు, 91-180 రోజులు, 181-364 రోజులు, 365 రోజులు సహా వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలను అందిస్తున్నది. వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి ఏడాది కాలం ఎఫ్‌డీకి అతి తక్కువగా 6.35 శాతం వడ్డీ రేటును ఇవ్వనున్నది. గూగుల్‌ పే భారతదేశంలో 1.50 కోట్ల నెలవారీ ఆక్టీవ్‌ యూజర్స్‌ కలిగి ఉంది.
 
అధిక వడ్డీ పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను అందించడానికి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఫిన్‌టెక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఇటీవల, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నియో, ఫ్రియో వంటి ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యమై సేవింగ్స్‌ ఖాతాల్లో రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్‌లకు 7 శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments