ప్లేస్టోర్ నుంచి 29 యాప్‌లను తొలగించిన గూగుల్.. కారణం ఏంటంటే?

Webdunia
బుధవారం, 29 జులై 2020 (17:15 IST)
గూగుల్ ప్లేస్టోర్ నుంచి 29 యాప్‌లు తొలగించబడ్డాయి. ఈ మేరకు గూగుల్ 29 యాప్‌లను తొలగించింది. యాడ్‌వేర్‌తో నిండిన ఈ యాప్‌లలో వినియోగంలో లేని యాడ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్‌ గుర్తించింది.

అంతేకాదు ఇవి ఉండటం వలన ఫోన్‌ అన్‌లాక్ అవ్వడం, యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం, ఫోన్‌ని ఛార్జ్ చేయడం, మొబైల్ డేటా నుంచి వై-ఫైకి మారడం వంటివి ఫోన్‌లో అటోమెటిక్‌గా జరుగుతున్నాయని తెలిపింది. 
 
వీటిలో ఏ యాప్‌ అయినా ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఫోన్‌లో లాంచ్ ఐకాన్స్‌ ఫోన్ నుంచి వెంటనే కనిపించకుండా పోతాయి. దీని ద్వారా యూజర్‌ ఆ యాప్‌లను డిలీట్ చేయడానికి కష్టంగా మారుతుంది. ఇక యాప్‌ల ద్వారా కనిపించే ప్రకటనలు కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంటాయి. ఇలా ఉండటం హానికరమని భావించిన గూగుల్‌, 29 యాప్‌లను తొలగించింది.
 
అలాగే ఫోన్ మొత్తం స్క్రీన్‌ను ఆక్రమిస్తాయని గూగుల్ వెల్లడించింది. అందుకే ఈ యాప్‌లను తొలగించినట్లు వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా సతోరి ఇంటెలిజెన్స్‌ బృందం, చార్ట్రూస్బ్లూర్‌ పేరుతో జరిపిన పరిశోధనల్లో మొత్తం 29 యాప్‌లను గుర్తించారు. వీటిలో అధికంగా ఫోటో ఎడిటింగ్‌ యాప్‌లు ఉన్నట్లు సమాచారం.

భవిష్యత్‌లోనూ ఇలాంటి యాప్‌ల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశముందని.. ఇందుకు సతోరి బృందం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments