ఈ నెల 28 నుంచి గూగుల్ 6ఏ ప్రీ ఆర్డర్స్ బుకింగ్స్ ప్రారంభం

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:41 IST)
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చాలా రోజుల తర్వాత మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గూగుల్ 6ఏ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసే ఈ ఫోన్‌కు సంబంధించి ప్రీఆర్డర్ బుకింగ్స్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. 6జీబీ ర్యాబ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే వేరియంట్‌తో దీన్ని విడదల చేయనుంది. 
 
ఈ ఫోనుకు ఫ్లిప్‌కార్ట్ ఫ్లాట్ ఫామ్‌పై ముందస్తు ఆర్డర్లు మొదలయ్యాయి. ముందస్తు ఆర్డర్ చేసే వారికి ఈ నెల 28వ తేదీ నుంచి డెలివరీ చేయనున్నారు. పిక్స్ 4ఏ తర్వాత గూగుల్ నుంచి వస్తున్న ఫోన్ ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ.43,999గా నిర్ణయించారు. 
 
అయితే, యాక్సిస్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.4 వేల వరకు తక్షణ డిస్కౌంట్ ఇస్తారు. అంటే రూ.39,999కే లభించనుంది. అలాగే, గూగుల్ పిక్సల్ 4ఏను వాడుతున్నవారికి కూడా ఆఫర్ ఇచ్చింది. పాత ఫోనును మార్పిడి చేసుకునేవారికి రూ.6 వేలు, ఇతర అన్ని ఫోన్ల మార్పిడిపై రూ.2 వేలు చొప్పున తగ్గింపు ఇవ్వనుంది. ఈ ఫోనులో డేటాకు అధిక భద్రత, నీరు పడినా పాడైపోకుండా ఐపీ 67 రక్షణతో పిక్సల్ 6ఏను తయారు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments