గూగుల్ పిక్సెల్ 5ఏఐ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ వెబ్‌సైట్లో ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ అక్టోబర్‌లో లాంచ్ కానుందని టాక్ వస్తోంది. ఈ వెబ్ సైట్లో దీని పేరును గూగుల్ పిక్సెల్ 5గా పేర్కొన్నారు. అలాగే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌తో ఇది కనిపించింది. అయితే ఈ ప్రాసెసర్‌ను బట్టి చూస్తే ఈ ఫోన్ ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది.
వన్ ప్లస్ నార్డ్‌లో కూడా ఇదే ప్రాసెసర్‌నే అందించారు. గతంలో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 4, గూగుల్ పిక్సెల్ 4 ఎక్స్ఎల్‌ల్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ స్కోర్ 39.4గా ఉండటం విశేషం.
గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 5 ఎక్స్ఎల్ ల్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. గూగుల్ పిక్సెల్ 4ఏ 4జీ వేరియంట్ మనదేశంలో అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ.26వేలకు పైబడి వుంటుంది.