Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 1 నుంచి గూగుల్ పే కొత్త రూల్స్‌..

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (09:31 IST)
జనవరి 1 నుంచి గూగుల్ పే కొత్త రూల్స్‌ని అమలులోకి తీసుకురానుంది. 2022 జనవరి 1 నుంచి కార్డు నెంబర్లు, ఎక్స్‌పైరీ డేట్ వంటి వివరాలను గూగుల్ పే నిక్షిప్తం చేసుకోదని గమనించాలి. అంటే కార్డు వివరాలను గూగుల్ పే స్టోర్ చేసి వుంచదు. 
 
గూగుల్ పే కూడా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను ఫాలో కావాల్సి వుంది. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ పేమెంట్ల కోసం గూగుల్ పేలో కార్డు వివరాలను సేవ్ చేసుకున్న వారు ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోవాల్సి వుంది. 
 
కార్డు జారీ సంస్థలు, కార్డు నెట్‌వర్క్ సంస్థలు మినహా వ్యాపారులు, ఇతర సంస్థలు కస్టమర్లు కార్డు వివరాలను స్టోర్ చేసుకోకూడదనే ఆర్బీఐ రూల్. ఇదివరకు కస్టమర్ల కార్డు డేటా సేవ్ చేసుకొని ఉంటే వాటిని తొలగించాలి.
 
ఇకపోతే.. ఈ మార్పు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, పెరుగుతున్న సైబర్ మోసాల సంఘటనలు కూడా తగ్గుతాయి. ఈ మార్పును అనుసరించి, మాస్టర్ కార్డును ఉపయోగిస్తున్న వ్యక్తులు వారి కార్డ్ వివరాలను కొత్త ఫార్మాట్‌లో సేవ్ చేయడానికి వారికి అధికారం ఇవ్వవలసి ఉంటుంది. 
 
మీరు మీ కార్డ్ వివరాలను నమోదు చేయడం ద్వారా వన్-టైమ్ మాన్యువల్ చెల్లింపును చేయగలరు. మళ్లీ చెల్లింపు చేయడానికి మీరు మీ కార్డ్ వివరాలను మళ్లీ నమోదు చేయాలి. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments