గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా... మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ కాలం కరిగిపోద్ది...
ఇంటర్నెట్ వినియోగించేవారిలో ఎక్కువమంది బ్రౌజింగుకు గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజరు అంత ఉత్తమమైనదేమీ కాదంటోంది మైక్రోసాఫ్ట్. క్రోమ్ ద్వారా సమాచారాన్ని, వీడియోలను వీక్షించినప్పుడు... మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్ ద్వా
ఇంటర్నెట్ వినియోగించేవారిలో ఎక్కువమంది బ్రౌజింగుకు గూగుల్ క్రోమ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజరు అంత ఉత్తమమైనదేమీ కాదంటోంది మైక్రోసాఫ్ట్. క్రోమ్ ద్వారా సమాచారాన్ని, వీడియోలను వీక్షించినప్పుడు... మరీ ముఖ్యంగా ల్యాప్‌టాప్ ద్వారా వీక్షించినప్పుడు దాని బ్యాటరీ చార్జ్ త్వరగా అయిపోతుందని తెలిపింది. క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లతో పోల్చి చూసినప్పుడు ఈ విషయం తేలిందని వెల్లడించింది.
క్రోమ్‌ని వినియోగిస్తే... ల్యాప్‌టాప్ బ్యాటరీ- 4 గంటల 19 నిమిషాల 50 సెకన్లు మాత్రమే వస్తుందట. ఇక ఫైర్‌ఫాక్స్ అయితే 5 గంటల 9 నిమిషాల 30 సెకన్లు, ఒపేరా 6 గంటల 18 నిమిషాల 33 సెకన్లు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే 7 గంటల 22 నిమిషాల 7 సెకన్లు వస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. మరి దీనిపై గూగుల్ క్రోమ్ ఏం చెపుతుందో...?