Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త ఏఐ ఫీచర్లతో గూగుల్ నుంచి పిక్సెల్ 9 సిరీస్

సెల్వి
బుధవారం, 14 ఆగస్టు 2024 (10:16 IST)
Google Pixel 9
సరికొత్త ఏఐ ఫీచర్లతో గూగుల్ నుంచి పిక్సెల్ 9 సిరీస్ భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. గూగుల్, ఫ్లిఫ్ కార్ట్ ద్వారా సేల్ ఆరంభించింది. 
 
గూగుల్ యాజమాన్యంలోని మూడు వాక్-ఇన్ సెంటర్‌లను ప్రారంభించింది. ఇది 15 నగరాల్లోని 150 రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ ఎల్  కోసం ప్రీ-ఆర్డర్‌లు బుధవారం నుండి ప్రారంభమవుతాయి.
 
ఈ పరికరాలు ఆగస్టు 22 నుండి అందుబాటులో ఉంటాయి. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్, పిక్సెల్ వాచ్ 3, పిక్సల్ బడ్స్ ప్రో2ని కూడా ఆవిష్కరించింది. ఇది సంవత్సరం తర్వాత అందుబాటులోకి వస్తుంది. భారతదేశంలో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ధర వరుసగా రూ. 79,999, రూ. 1,09,999, రూ. 1,24,999లకు లభిస్తుంది.
 
గూగుల్ తన మునుపటి తరం పిక్సెల్ ఫోన్‌ల ధరలను భారతదేశంలో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ప్రకారం, పిక్సెల్ 9 ఫోన్‌లు ఏఐ నుండి సరికొత్త ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. Pixel 9 Pro (6.3-inch), Pixel 9 Pro XL (6.8-inch) ఈ రెండు డివైజ్‌లు ఇంకా ప్రకాశవంతమైన సూపర్ యాక్చువా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 
 
షార్ప్, ప్రకాశవంతమైన తక్కువ-కాంతి ఫోటోల కోసం కొత్త 42 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. Pixel 9 6.3-అంగుళాల Actua డిస్‌ప్లేను అందిస్తుంది. Pixel 8 కంటే 35 శాతం ప్రకాశవంతంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments