క్రోమ్ యూజర్లకు కేంద్రం ఓ హెచ్చరిక చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు ఉన్నట్టు పేర్కొంది. ఆ లోపాలను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు లేదా హ్యాకర్లు దాడులకు పాల్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది.
క్రోమ్‌లో ఉన్న బగ్స్ కారణంగా హ్యాకర్లు కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకునే వీలుంటుందని, ఆ కంప్యూటర్లను ఎక్కడినుంచైనా వారు ఆపరేట్ చేయగలరని కేంద్రం ప్రభుత్వ ఆదీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్-సీఈఆర్టీ తెలిపింది.
కంప్యూటర్‌లో భద్రపరిచిన డేటాను, క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను కూడా హ్యాకర్లు దొంగలించగలరని పేర్కొంది. ప్రమాకర మాల్వేర్‌లను కూడా వారు కంప్యూటర్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం సాధ్యమవుతుందని తెలిపింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించేవారు వెంటనే లేటెస్ట్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ స్పష్టం చేసింది.