Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోర్టులో 'బాస్' అని సంబోధించరాదు.. అవును.. కాదు అని మాత్రమే చెప్పాలి : విశాల్‌పై న్యాయమూర్తి ఆగ్రహం

Advertiesment
high court - vishal

వరుణ్

, శుక్రవారం, 2 ఆగస్టు 2024 (15:13 IST)
కోర్టు బోనులో నిలబడి 'బాస్' అని సంబోధించకూడదని, అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పాలని హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, లైకాతో ఒప్పందంపై తనకు ఎలాంటి అవగాహన లేదని, పైగా, తెల్లకాగితంపై తన సంతకం తీసుకున్నారంటూ కోర్టుకు విశాల్ చెప్పడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. 
 
నటుడు విశాల్ తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం సినిమా ఫైనాన్షియర్ అన్బుచ్ చెలియన్ నుండి తీసుకున్న 21.29 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించేందుకు లైకా ప్రొడక్షన్ ముందుకు వచ్చింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిల్మ్ కంపెనీ నిర్మించిన అన్ని సినిమాల హక్కులను తమకు ఇవ్వాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ‘వీరమే వాగై చూడుం’ చిత్రాన్ని విడుదల చేసిన విశాల్ చిత్ర సంస్థపై విశాల్ చిత్ర సంస్థపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
 
ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ నిమిత్తం నటుడు విశాల్ గురువారం జస్టిస్ పీటీ ఆషా ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో లైకా కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది వి.రాఘవాచారి హాజరై లైకా, విశాల్ మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎత్తి చూపుతూ ప్రశ్నలు సంధించారు. ఒప్పందంపై తనకు ఎలాంటి అవగాహన లేదని, ఖాళీ కాగితంపై సంతకం చేశానని విశాల్ బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి.. ‘‘మీ సంతకాన్ని ఎలా తిరస్కరిస్తారు? మీరు చాలా తెలివిగా సమాధానం ఇస్తున్నారని అనుకుంటున్నారా? అన్నారు. మరి ఇది సినిమా షూటింగ్ కాదు. జాగ్రత్తగా సమాధానం చెప్పాలని విశాల్‌కు సూచించిన న్యాయమూర్తి.. 'సండైకోళి-2' విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇస్తానని చెప్పారా అని ప్రశ్నించారు. దానికి విశాల్ జడ్జిని బాస్ అని సంబోధించారు. 
 
అప్పుడు న్యాయమూర్తి కలుగజేసుకుని ఇక్కడ ఇలా బాస్ అని చెప్పకూడదు. అడిగే ప్రశ్నలకు అవును, కాదు అని మాత్రమే సరైన సమాధానం ఇవ్వాలని ఆయన మందలించారు. ఆ త‌ర్వాత లైకా నుంచి త‌ప్ప మ‌రెవ‌రి వ‌ద్ద అయినా లోన్ తీసుకున్నారా అని విశాల్ ప్ర‌శ్నించ‌గా, అవున‌ని లైకా సంస్థ కారణంగానే ఇతరుల వద్ద రుణం తీసుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు చలన చిత్ర రంగంలో మహిళల యుగం రాబోతుంది !