Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ విద్యార్థికి ఫేస్ బుక్ నజరానా... ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (21:30 IST)
ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక భారతీయ విద్యార్థి తెలివి తేటలకు మెచ్చి అతడిని సత్కరించనుంది. కేరళ రాష్ట్రం అళపుజకు చెందిన 19 ఏళ్ళ విద్యార్థి కేఎస్ అనంతకృష్ణకు ఫేస్‌బుక్ ధన్యవాదాలు తెలిపింది. వాట్సాప్‌లో వినియోగదారుకి తెలియకుండానే వారి ఫైళ్లను, ఇతర సమాచారాన్ని పూర్తిగా తొలగించే ఓ బగ్‌ను ఈ విద్యార్థి కనుగొన్నాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన అనంతకృష్ణ ఈ బగ్ గురించి ఫేస్‌బుక్‌కి తెలియజేసాడు, అంతేకాకుండా దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా వివరించాడట.
 
అనంతకృష్ణ కనుగొన్న బగ్‌పై ఫేస్‌బుక్ దాదాపు రెండు నెలలపాటు నిశితంగా అధ్యయనం చేసి, దాన్ని గుర్తించింది. ఈ విద్యార్థి తెలివితేటలకు ఆశ్చర్యపోయి అతడిని సత్కరించాలని నిర్ణయించింది. అనంతకృష్ణకు రూ.34,000 నగదు బహుమతితో, అలాగే ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్‘లో ఇతనికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఫేస్‌బుక్ థ్యాంక్స్ లిస్టులోని 80వ స్థానంలో అనంతకృష్ణ పేరు ఉంది. అనంతకృష్ణ కూడా ఫేస్‌బుక్‌కి కృతజ్ఞతలు తెలియజేశాడు. కేరళ ప్రభుత్వానికి సంబంధించిన సైబర్ సెల్‌లో కూడా ఈ విద్యార్థి తన వంతు సేవలందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments