వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రాంకు అలా కలిసొచ్చింది

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:23 IST)
వాట్సాప్ సాంకేతిక లోపం టెలిగ్రామ్‌కు కలిసొచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వాట్సాప్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ను 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తుండగా టెలిగ్రామ్‌ను కేవలం 10 కోట్ల మంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. 
 
బుధవారం ఫేస్‌బుక్ మెసేజింగ్ యాప్, వాట్సాప్ రెండూ సాంకేతిక కారణాలతో నిలిచిపోవడంతో యూజర్లు భారీ సంఖ్యలో టెలిగ్రాం యాప్ వైప్ మళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రాం వెల్లడించింది. బుధవారం నాడు కొన్ని గంటల వ్యవధిలో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజింగ్ సేవలు నిలిచిపోవడంతో ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది కొత్త యూజర్లు టెలిగ్రాం నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం సంస్థ తెలిపింది. 
 
వాట్సాప్‌కు పోటీగా ఎంట్రీ ఇచ్చిన టెలిగ్రాంకు మొదట్లో బాగా ఆదరణ ఉన్నప్పటికీ సరికొత్త ఫీచర్లతో వాట్సాప్ దూసుకుపోవడంతో బాగా వెనుకబడింది. ప్రస్తుతం టెలిగ్రాం 10 కోట్ల మంది వినియోగదారులతో ఉంది. ఫేస్‌బుక్ యాజమాన్యంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లకు బుధవారం నాడు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కొన్ని కోట్ల మంది యూజర్లు ఫిర్యాదులు చేసారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా ధృవీకరించింది. అయితే గురువారం ఉదయానికల్లా సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments