Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థర్డ్ పార్టీలు డెవలప్ చేసిన వాట్సాప్ యాప్‌లు.. సంస్థ సీరియస్

థర్డ్ పార్టీలు డెవలప్ చేసిన వాట్సాప్ యాప్‌లు.. సంస్థ సీరియస్
, మంగళవారం, 12 మార్చి 2019 (17:56 IST)
థర్డ్ పార్టీలు డెవలప్ చేసిన అనుబంధ వాట్సాప్ యాప్‌లను ఉపయోగించే వినియోగదారులకు వాట్సాప్ సంస్థ అడ్డుకట్ట వేసింది. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులు, నివేదికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.


సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో, అధికారిక వాట్సాప్‌ నియమ నిబంధనలను, సేవలను పాటించడంలో విఫలమైనందున, అదేవిధంగా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేయక తప్పడం లేదని చెప్పింది. వాట్సాప్‌ ప్లస్‌, జీబీ వాట్సప్‌ల యూజర్లను బ్యాన్‌ చేస్తునట్లు ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తెలిపింది. 
 
వినియోగదారులందరూ అధికారిక వాట్సాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. అనుబంధ యాప్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు దానికి ఎలా మారాలో కూడా వివరించింది. ''మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడింది" అని మీ వాట్సాప్‌కు సందేశం వస్తే మీరు అధికారిక వాట్సప్ కాకుండా మరో దానిని ఉపయోగిస్తున్నారని అర్థం.

వారంతా కచ్చితంగా అఫిషియల్ యాప్‌కి మారాల్సిందే అని చెప్పింది. అలాగే వాటిలో చేసిన సంభాషణలన్నీ మీ అధికారిక యాప్‌లోకి బదీలీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేమని తెల్చేసింది. సమాచార భద్రత దృష్ట్యా అనధికారిక యాప్‌లకు తాము మద్దతు ఇవ్వమని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసికి టాటా... పూరీ నుంచి మోడీ పోటీ?