Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌కు కష్టాలు.. వివరణ ఇచ్చిన ఫేస్‌బుక్.. భారత చట్టాలను గౌరవిస్తాం..

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (14:40 IST)
వాట్సాప్‌కు కష్టాలు తప్పట్లేదు. నూతన ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత సమాచార భద్రతకు వ్యతిరేకంగా ఉందని వచ్చిన వ్యాఖ్యలపై వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ఓ కార్యక్రమంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మాట్లాడారు. 
 
ప్రైవసీ పాలసీపై తాము మరికొంచెం వివరణాత్మకంగా చెబితే బాగుండేదని.. వ్యక్తిగత సమాచారం ఎన్‌క్రిప్షన్ చేయడంలో వాట్సాప్ నిబద్ధతను ఎవరూ అనుమానించలేరని అన్నారు. తామేమీ యూజర్ల సందేశాలను చదవబోమని, ఏ ఒక్కరి సందేశాలను తాము వీక్షించబోమని మరోసారి స్పష్టం చేశారు.
 
ఇతరులెవ్వరూ కూడా యూజర్ల సందేశాల్లోకి తొంగి చూసే అవకాశం లేదని, ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేశామో అందరికీ అర్థమయ్యేలా వివరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పికొచ్చారు. 
 
ఓ బాధ్యతాయుతమైన సంస్థగా భారత చట్టాలను తాము గౌరవిస్తామని, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ వంటి తమ వేదికలను పెద్దసంఖ్యలో భారతీయులు వినియోగిస్తున్నారని వెల్లడించారు. తమ వేదికలను దుర్వినియోగపర్చడాన్ని తాము కోరుకోవడంలేదని అన్నారు. ఫేక్ న్యూస్ విషయంలో తాము ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments