Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఏమన్నారు..? ట్విట్టర్ Vs కేంద్రం...!

సోషల్ మీడియాపై సత్య నాదెళ్ల ఏమన్నారు..? ట్విట్టర్ Vs కేంద్రం...!
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:34 IST)
సోషల్ మీడియాపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద వ్యాఖ్యలు, ఖాతాలకు సంబంధించి కొన్ని కఠిన, స్పష్టమైన చర్యలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
 
ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సోషల్ మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరించకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అసత్య, హింస ప్రేరేపిత ఖాతాలకు సంబంధించిన విషయంలో కచ్చితంగా కఠిన చట్టాలు, నిబంధనలు రూపొందించాలన్నారు. ప్రపంచంతో కలిసి బాగా పని చేసే వ్యాపార నమూనా అవసరమన్నారు. కొన్ని అంశాల్లో పోటీ లేకపోవడం సమస్యలను సృష్టిస్తోందని అభిప్రాయపడ్డారు.
 
ఇదిలా ఉంటే.. కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే విషయమై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌, కేంద్రం మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. ఇది అన్ని సోషల్ మీడియా వేదికలు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌, న్యూస్ సంబంధిత వెబ్‌సైట్లను నియంత్రించడానికి నిబంధనల రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో కోడ్ ఆఫ్ ఎథిక్స్‌, నిరంతర సమ్మతి నివేదికలను సమర్పించడంతోపాటు స్వీయ నియంత్రణ వ్యవస్థ తదితర నిబంధనలు ఇందులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాఢంగా ప్రేమించింది, పెళ్ళి సమయానికి మరో ప్రేమికుడితో జంప్...