Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్ స్టిక్‌ను దొంగలించిన శునకం..

Advertiesment
లిప్ స్టిక్‌ను దొంగలించిన శునకం..
, గురువారం, 11 ఫిబ్రవరి 2021 (12:30 IST)
కాలికి లిప్ స్టిక్ వేసుకున్న ఓ శునకం దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఇంతకీ ఆ కుక్క దొంగతనం చేసిందేంటో తెలుసా? 'లిప్ స్టిక్' దొంగతనం చేసింది. కుక్క దొంగతనం చేసిందంటేనే వింత. పైగా ఆ కుక్క లిప్ స్టిక్ ను కాజేయటం ఏంటి? అదే మరి విశేషం. 
 
ఇంతకీ ఆ కుక్క లిప్ స్టిక్‌ను పెదాలకు వేసుకోలేదు…అదేనండీ మూతికి వేసుకోలేదు. కాళ్లకు వేసుకుంది? అలా వింత వింత చేష్టలు చేసిన ఆ కుక్క సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. మరి కాళ్లకు లిప్ స్టిక్ వేసుకున్న ఆ దొంగతనం చేసిన ఆ కుక్క నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
 
వివరాల్లోకి వెళితే.. డాక్టర్‌ సుల్భా కేజీ అరోరా అనే యవతి తన ట్విటర్‌ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్‌ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. సుల్భా.. '' నిన్న రాత్రి ఓ దొంగ డ్రెసర్‌లోంచి మా అమ్మ లిప్‌స్టిక్‌ను దొంగిలించుకుపోయాడు. లక్కీగా ఆ దొంగ దొరికేశాడు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నాం'' అని చెప్పుకొచ్చింది. 
 
ఇదే మా అమ్మ లిప్ స్టిక్‌ను దొంగతనం చేసిన ఆ దొంగ అంటూ కాళ్లకు లిప్‌స్టిక్‌ రంగుతో ఉన్న పెంపుడు కుక్క ఫొటోను కూడా షేర్‌ చేసింది. కాళ్లకు ఎర్రరంగు లిప్ స్టిక్ అంటుకున్న ఈ కుక్క సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా తెరాస ఎంపీ కుమార్తె!