మాపెల్స్‌ డాట్‌ కామ్‌పై మాపెల్స్‌ రియల్‌ వ్యూ ద్వారా వర్ట్యువల్‌గా 3డీ మెటావర్శ్‌ మ్యాప్‌ సర్వీస్‌

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:42 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ మ్యాప్స్‌- డీప్‌ టెక్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ  మ్యాప్‌ మై ఇండియా ఇప్పుడు ప్రజల కోసం మాపెల్స్‌ రియల్‌ వ్యూ ను విడుదల చేసినట్లు వెల్లడించింది. భారతదేశపు మొట్టమొదటి, పూర్తి దేశీయ ఆల్‌ ఇండియా 360 డిగ్రీ పనోరమిక్‌ స్ట్రీట్‌ వ్యూ, 3ఈ మెటావర్శ్‌ మ్యాప్‌ సేవలను భారతదేశపు సొంత, ఉచిత మ్యాపింగ్‌ పోర్టల్‌ మాపెల్స్‌ డాట్‌ కామ్‌పై  వీక్షించవచ్చు. మొబైల్స్‌, డెస్క్‌టాప్‌లపై అందుబాటులో ఉండే వెబ్‌తో పాటుగా మాపెల్స్‌ యాప్‌ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌పై కూడా అందుబాటులో ఉంటుంది.

 
ఈ ఆవిష్కరణ సందర్భంగా మ్యాప్‌మై ఇండియా సీఈవో మరియు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  రోహన్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ మాపెల్స్‌ రియల్‌ వ్యూ ఇప్పుడు మాపెల్స్‌ డాట్‌ కామ్‌, మాపెల్స్‌ యాప్‌పై లభ్యమవుతుంది. వినియోగదారులు వర్ట్యువల్‌గా భారతదేశాన్ని గతంలో ఎన్నడూ చూడని రీతిలో అన్వేషించడంతో పాటుగా వీధుల అందాలు, రోడ్లు, పలు పర్యాటక ప్రాంతాలు, గృహ, వాణిజ్య ప్రాంతాలు, హైవేలను వీక్షించవచ్చు.

 
విదేశీ మ్యాప్‌ యాప్‌లకు భిన్నంగా దేశీయ ప్రత్యామ్నాయం అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సామర్థ్యం పరంగా అత్యాధునికమైనది కావడంతో పాటుగా వినియోగదారులకు మరింత విలువనూ అందిస్తుంది. భారతదేశంలోని వినియోగదారులు మాపెల్స్‌ వినియోగించడంతో పాటుగా మాకు తగిన ఫీడ్‌బ్యాక్‌ అందించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. వినియోగదారులు మాపెల్స్‌ రియల్‌ వ్యూను పూర్తి ఉచితంగా మాపెల్స్‌ డాట్‌ కామ్‌  పోర్టల్‌ లేదా మాపెల్స్‌ యాప్‌ పై పొందవచ్చు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments