#jio: UPI చెల్లింపు సేవ.. జియో పే ద్వారా.. జీ-పే, ఫోన్-పే, పేటీఎంలతో పోటీ?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (11:37 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం కొత్త రకం సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో తన మైజియో యాప్ ద్వారా సరికొత్త యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా చెల్లింపులు నిర్వహించొచ్చు. 
 
జియో యూజర్లు వారి బ్యాంక్ అకౌంట్‌‌ను జియో యాప్‌లోని యూపీఐతో లింక్ చేసుకొని పేమెంట్స్ నిర్వహించవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపడం.. స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పాస్‌బుక్ వంటి పలు ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు మల్టీపుల్ బ్యాంక్ అకౌంట్లను మైజియో యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
 
ఇప్పటికే కొంతమంది యూజర్లకు మైజియో యాప్‌లో యూపీఐ పేమెంట్స్ ఆప్షన్ కనిపిస్తోందని సమాచారం. ఈ యాప్ ద్వారా జియో సబ్‌స్క్రైబర్లు అట్‌జియో వర్చువల్ పేమెంట్ అడ్రెస్‌తో యూపీఐ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో కొత్త సేవలతో జియో యూజర్లు మైజియో యాప్ నుంచి నేరుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చునని వార్తలు వస్తున్నాయి. దీంతో జీ-పే, ఫోన్‌పే, పేటీఎంలతో జియో యూపీఏ చెల్లింపు సేవలు పోటీపడేలా వుంటాయని ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments