ఈపీఎఫ్ఓ వాట్సాప్ హెల్ప్‌లైన్ సేవలు.. కాల్ సెంటర్ కూడా..?

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (10:35 IST)
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్ హెల్ప్ లైన్ సేవను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. సభ్యులు ఈపీఎఫ్ఓ సేవకు సంబంధించి ఏ విచారణ అయినా వాట్సాప్ నెంబర్‌కు మెస్సేజ్ పంపించడం ద్వారా వివరాలు, సాయం పొందవచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్‌లో ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నంబర్ల వివరాలను పేర్కొన్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది.
 
చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సేవను తీసుకొచ్చినట్టు ఈపీఎఫ్ఓ కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కారానికి ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ ఏఎంఎస్, సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా సేవలు అందిస్తుండడం గమనార్హం. వాట్సాప్ సేవలు వీటికి అదనం. వారంలో అన్నిరోజులు, రోజులో 24 గంటల పాటు సేవలు అందించే కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది.
 
సభ్యులకు మరింత సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తాజాగా వాట్సాప్ ఆధారిత హెల్ప్ లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో సభ్యులకు ఎటువంటి ఆటంకాల్లేని సేవలు అందించడమే దీని లక్ష్యమని కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments