Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ కంపెనీలపై ట్రంప్ ఒత్తిడి.. భారతీయులకు షాక్... స్థానికులకే పెద్దపీట..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (14:23 IST)
అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి తీవ్రతరమైంది. ఐటీ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని ఎత్తి చూపుతూ, ఐటీ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీల్లో పని చేసే భారతీయులను తొలగించి, వారి స్థానంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా అనేక మంది భారతీయ టెక్ నిపుణులు స్వదేశీ బాట పట్టాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. 
 
ముఖ్యంగా, దేశ ఐటీ రంగానికి వెన్నెముకగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్.సి.ఎల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు అమెరికాలో కూడా కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి గత యేడాది 99,010 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ 2019లో పరిస్థితి భిన్నంగా ఉంది. 
 
డోనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసాలను కఠినతరం చేయడంతో పాటు కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పెంచాలంటూ భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. దీంతో భారతీయ టెక్‌ కంపెనీలు తదనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే అమెరికాలో అక్కడి వారికి ఉద్యోగమిచ్చేందుకే మొగ్గుచూపుతున్నాయి. 
 
విప్రో అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిలో 50 శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులే. టీసీఎస్‌ 2011-17 మధ్య కాలంలో అమెరికాలో 17,000 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత ఏడాదిలో మొత్తంగా 27,049 మందికి ఉద్యోగాలిచ్చిన టీసీఎస్‌.. అందులో మెజారిటీ సిబ్బందిని అమెరికా కార్యాలయాల్లోనే నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2020 నాటికి యూఎస్‌ మార్కెట్లో 10 వేల మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఇన్ఫోసిస్‌.. గత ఏడాది వరకు 7,600 మందికి పైగా నియమించుకుంది. ఫలితంగా భారతీయ టెక్ నిపుణులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments