Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్-ఆధార్ అనుసంధానం.. మార్చి 31, 2022 వరకు పొడిగింపు

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:30 IST)
పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తోందని టెన్షన్ పడనక్కర్లేదు. పాన్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే తుది గడువును మరో ఆరు నెలలు కేంద్రం పొడిగించింది. 
 
మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు. 
 
బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయడం, డీమ్యాట్‌ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. 
 
కాగా.. పాన్‌కార్డుకు ఆధార్‌తో అనుసంధానం గడువును కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. చివరిగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి అవుతుండగా.. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చినెల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
గడువులోగా మీరు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయకుంటే.. పాన్‌కార్డు చెల్లుబాటు కాదు. చెల్లని పాన్‌కార్డుతో లావాదేవీలు జరిపినట్లైతే.. భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పటికి మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే వెంటనే రెండింటినీ అనుసంధానం చేసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments