షాకింగ్ న్యూస్ : అమ్మకానికి ఫేస్‌బుక్ యూజర్ల డేటా

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:51 IST)
సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పింది. ఏకంగా ఏడు గంటల పాటు ఈ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు కొన్ని గంటల పాటు గందరగోళానికి గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నెట్‌వర్క్‌ పూర్తిగా నిలిచిపోయింది. 
 
సర్వర్స్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్‌బుక్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, ఒక్కసారిగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అవ్వడంతో షాక్‌ గురైన యూజర్లకు రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ మరో షాకిచ్చింది. ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్స్‌ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్‌ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్‌బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. 
 
ఈ నివేదిక ప్రకారం ఫేస్‌బుక్‌ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్‌బుక్‌ ఖాతాలు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్‌ ప్రైవసీ అఫైర్స్‌ నివేదించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments