గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారా?

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (12:38 IST)
గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ బ్రౌజర్‌ను ఉపయోగించే విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) ఓ హెచ్చరిక జారీచేసింది. చేసింది. గూగల్ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని, ఇవి హ్యాకర్లకు అవకాశాలుగా మారతాయని హెచ్చరించింది. అందువల్ల పీసీలు, ల్యాప్ టాప్‌లలో విండోస్ ఓఎస్ వాడేవారికి, మాక్ యూజర్లకు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు దీనివల్ల ఏమంత నష్టం ఉండకపోవచ్చని సీఈఆర్టీ పేర్కొంది.
 
గూగుల్ క్రోమ్‌లోని ఈ లోపాల కారణంగా ఆయా డివైస్‌లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతాయని, వాటిలోని సమాచారం హ్యాకర్ల పరమవుతుందని వివరించింది. ఈ నష్టాన్ని నివారించాలంటే వెంటనే విండోస్, మాక్ యూజర్లు తమ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌‍ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ స్పష్టం చేసింది. క్రోమ్‌కు సెక్యూరిటీ ప్యాచ్‌లు వస్తే, అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
 
విండోస్, మాక్ యూజర్లు తమ డివైస్‌లలో 132.0.6834.83/81, 132.0.6834.110/111కు ముందు వెర్షన్ల గూగుల్ క్రోమ్‌ను వాడుతున్నట్టయితే వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ తెలిపింది. ఇక, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు... 132.0.6834.110 వెర్షన్‌కు ముందు గూగుల్ క్రోమ్‌ను వాడుతున్నట్టయితే వారు కూడా లేటెస్ట్ వెర్షన్‌‌కు అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments