Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఫోటోలు ఇక ఫ్రీగా రావ్.. సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సిందేనా?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (17:01 IST)
గూగుల్ ఫోటోలు ఇక ఉచితంగా లభించవు. గూగుల్ ఫోటోస్ ఉచితంగా అందిస్తున్న స్టోరేజ్ సేవలను 2021 జూన్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు గూగుల్ సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మీదట గూగుల్ ఫోటోస్‌లో 15జీబీకి మించి డేటా స్టోర్ చేసుకోవాలంటే నెలవారీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 
 
గూగుల్ ప్రకటనతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. గూగుల్ ప్రకటించిన దాని ప్రకారం 15జీబీ స్టోరేజ్ వరకు మీరు ఎటువంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల, కేవలం 15జీబీ స్టోరేజీ పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి వుంటుంది. 
 
ఇతర క్లౌడ్ స్టోరేజ్ సర్వీసులతో పోలిస్తే గూగుల్ తక్కువ ధరలకే మెరుగైన సేవలను అందిస్తుంది. అంతేకాక, గూగుల్ ఫోటోస్‌లో అట్రాక్టివ్ ఫీచర్లు ఉంటాయి. కీవర్డ్, లొకేషన్ లేదా పేరు ద్వారా సులభంగా ఫోటోలను వెతకడం, ఆటోమేటిక్ ఫోటో బ్యాకప్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి, ఈ సేవలను పొందడానికి గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం మంచి ఎంపికని ఐటీ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments