Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం.. కోర్టులో వాట్సాప్

Webdunia
సోమవారం, 17 మే 2021 (19:00 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదమవుతుంది. తాజాగా తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని వాయిదా వేయలేమని మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టు వేదికగా స్పష్టం చేసింది. 
 
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాట్సాప్ తరఫున ఢిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. తమ కొత్త ప్రైవసీ పాలసీ విధానాన్ని అంగీకరించని వారి ఖాతాలను దశల వారీగా తొలగిస్తామని తెలిపారు. ఈ విధానాన్ని వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.
 
తమ నూతన పాలసీ ఐటీ నిబంధనలను అతిక్రమించట్లేదని.. నిబంధనలకు లోబడి మాత్రమే ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్‌ శర్మ కోర్టుకు చెప్పారు.
 
ఈ కొత్త పాలసీపై వాట్సాప్ ఉన్నతాధికారులకు కేంద్రం లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. కాగా, వాట్సాప్ యథాతధ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటీషనర్లు కోరగా.. హైకోర్టు నిరాకరించి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments