Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రిలయన్స్ జియో ఉచిత ఫోన్‌కాల్స్..

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:31 IST)
దేశ ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకను ఇచ్చింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీని పూర్తిగా రద్దు చేసింది. నిజానికి ఈ విధానం శుక్రవారంతో ముగిసింది. దీంతో పాత విధానం ప్రకారం ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయాన్ని కల్పించింది. 
 
రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచిత ఫోన్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత ఐయూసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అనేక మంది ఖాతాదారులు పెదవి విరిచారు. పైపెచ్చు.. అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. 
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
 
"ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు" అని రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments