Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ 4జీ వోల్టే సర్వీసులు...

దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఇందుకోసం 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప

Webdunia
శనివారం, 29 జులై 2017 (11:01 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచనాలు సృష్టిస్తున్న జియోను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఇందుకోసం 4జీ వోల్టే సర్వీసులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మొబైల్ ఉత్పత్తి తయారీ కంపెనీలతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. తద్వారా 4జీ వోల్టే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి జియోకు చెక్ పెట్టాలని భావిస్తోంది. 
 
ఇప్పటికిప్పుడు జియోలా సరికొత్తగా 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో జతకట్టి బండిల్ ఆఫర్లు ప్రకటించాలని యోచిస్తోంది. దేశంలో వీవోఎల్టీఈ సేవలను జియో ఒక్కటే అందిస్తుండగా వచ్చే ఏడాది నుంచి ఎయిర్‌టెల్ కూడా వీవోఎల్టీఈ సర్వీసులు అందించనుంది. 
 
కాగా, జియో కంటే ముందే దేశీయ మొబైల్ మేకర్ లావా 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే దీని ధర కాస్త ఎక్కువే. ఇప్పుడు  మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, కార్బన్‌ తదితర కంపెనీలు కూడా 4జీ ఫీచర్ ఫోన్‌ తయారీపై దృష్టిసారించాయి. దీనిని తనకు అవకాశంగా మార్చుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఆయా కంపెనీలతో కలిసి బండిల్ ఆఫర్లు ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments