ఎయిర్‌టెల్ రూ.98 డేటా ప్యాక్‌తో డబుల్ డేటా

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (19:52 IST)
ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రోజురోజుకూ సరికొత్త ఆఫర్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. సాధారణంగా ఈ సంస్థ అందిస్తున్న రూ.98 డేటా యాడ్ ఆన్ ప్యాక్‌పై ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తోంది. అంటే, ప్రస్తుతం రూ.98కి ఇస్తున్న 6జీబీ హైస్పీడ్ డేటాతో పాటు మరో 6జీబీ హైస్పీడ్ డేటాను వినియోగదారులు బ్రౌజ్ చేసుకోవచ్చు. 
 
గతంతో పోలిస్తే, డేటాను రెండు రెట్లు పెంచడంతో వినియోగదారులకు మరింత డేటా బ్రౌజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలకు దారితీసిన జియో కూడా ఇదే తరహాలో తమ వినియోగదారులకు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. వొడాఫోన్ సంస్థ కూడా నెలవారీ రీఛార్జ్ చేసుకునే వారికి రోజువారీ అందించే 1.5 జీబీతో పాటు మరో 1.5జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. 
 
అలాగే జియో సైతం రూ. 101 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు యాడ్-ఆన్ ప్యాక్‌తో 12జీబీ హైస్పీడ్ డేటాతో పాటుగా 1000 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించడం వల్ల లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వేలాది మందికి ఈ డేటాను ఉపయోగించుకునే అవకాశం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments