4జీ హ్యాండ్‌సెంట్లలో ఎయిర్ టెల్‌‍ 5జీ సేవ‌లు

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవ‌ల‌కు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మ‌ల్టిపుల్ ఔట్‌ప

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (15:07 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం తన వినియోగదారులకు తీపికబురు చెప్పింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 5జీ సేవ‌ల‌కు పునాదిగా భావించే 'మాసివ్ మల్టిపుల్-ఇన్‌పుట్ మ‌ల్టిపుల్ ఔట్‌పుట్ (మీమో)' టెక్నాల‌జీని భార‌త్‌లో ప‌రిచ‌యం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
తొలుత బెంగ‌ళూరు, కోల్‌క‌తా న‌గ‌రాల్లో ఈ సేవ‌ల‌ను ప్రారంభించి, ఆ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపింది. ఈ టెక్నాల‌జీ వ‌ల్ల మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ మ‌రింత వేగ‌వంతం కానుంది. ఇది అమ‌ల్లోకి వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న నెట్‌వ‌ర్క్ సామ‌ర్థ్యం 5-6 రెట్లు మెరుగుప‌డి, డేటా స్పీడ్ 2-3 రెట్లు పెరుగుతుంద‌ని ఎయిర్‌టెల్ అభిప్రాయ‌ప‌డింది. 
 
అయితే, వినియోగ‌దారులు ఉప‌యోగిస్తున్న 4జీ హ్యాండ్‌సెట్‌లోనే ఎలాంటి టారిఫ్‌లు, మార్పులు చేయ‌కుండా 5జీ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఎయిర్‌టెల్ ప్రారంభించిన 'ప్రాజెక్ట్ లీప్'లో భాగంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇటీవ‌ల టెలికాం శాఖ 2020లోగా భార‌త్‌లోకి పూర్తిస్థాయి 5జీ సేవ‌ల‌ను తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకోసం రూ. 500 కోట్ల నిధిని కూడా ప్ర‌భుత్వం కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karva Chauth: చంద్రుడంత ప్రకాశవంతమైన ప్రేమ వరుణ్ తేజ్ ది : లావణ్య త్రిపాఠి

Priyadarshi: మిత్ర మండలి చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Rashmika: వజ్రపు ఎంగేజ్‌మెంట్ ఉంగరం మెరిసిపోతుందిగా.. రష్మిక మందన అలా దొరికిపోయింది.. (video)

Vijay Deverakonda: ఈనెలలోనే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చిత్రం రెగ్యులర్ షూటింగ్

Vijaya Setu: విజయసేతుపై డాక్టర్ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ మళ్ళీ వైరల్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments