Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ కింద‌ప‌డితే... ఎయిర్ బెలూన్లు తెరుచుకుంటాయి...

ముంబై : ఖ‌రీదైన స్మార్ట్ ఫోన్ పొర‌పాటు కిందప‌డితే... ఇంకేమైనా ఉందా? మ‌న గుండె గుభేలుమంటుంది. సెల్ ఫోన్ స్క్రీన్ ప‌గిలిందా? అస‌లు ఫోనే ప‌నిచేయ‌డం ఆగిపోయిందా? పాడైపోయిందా?... అయ్యో ఖ‌రీదైన ఫోన్ అంటూ తెగ బాధ‌ప‌డిపోతాం. ఇలాంటి ప్ర‌మాదాల‌కు చెక్ పెడుతూ, క

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (17:21 IST)
ముంబై : ఖ‌రీదైన స్మార్ట్ ఫోన్ పొర‌పాటు కిందప‌డితే... ఇంకేమైనా ఉందా? మ‌న గుండె గుభేలుమంటుంది. సెల్ ఫోన్ స్క్రీన్ ప‌గిలిందా? అస‌లు ఫోనే ప‌నిచేయ‌డం ఆగిపోయిందా? పాడైపోయిందా?... అయ్యో ఖ‌రీదైన ఫోన్ అంటూ తెగ బాధ‌ప‌డిపోతాం. ఇలాంటి ప్ర‌మాదాల‌కు చెక్ పెడుతూ, కొత్త‌గా సెల్ ఫోన్ల‌కూ ఎయిర్ బ్యాగ్‌లు వ‌చ్చేస్తున్నాయి. 
 
జపాన్‌కు చెందిన హోండా కంపెనీ వీటిని త‌యారుచేసింది. కార్ల తయారీలో పేరుగాంచిన హోండా కంపెనీ, కార్లలో లాగానే స్మార్ట్ ఫోన్ల కోసం ఎయిర్ బ్యాగ్స్‌ను తయారుచేసింది. స్మార్ట్ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా వ‌చ్చే ఈ సౌకర్యాన్ని కేస్ ఎన్... అని పిలుస్తారు. ఈ పరికరం స్మార్ట్ ఫోన్‌కి రక్షణ కవచంలా ప‌నిచేస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ కింద పడిన వెంట‌నే ఆరు ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయి. దీంతో స్మార్ట్ ఫోన్ భ‌ద్రంగా ఉంటుంది. 
 
యాపిల్ కంపెనీ ఈ తరహా డిజైన్ ఒకటి తయారుచేయాలని కోరడంతో కేస్ ఎన్‌ను రూపొందించామని హోండా కంపెనీ తెలిపింది. దీనిని మ‌రింత డెవ‌ల‌ప్ చేసి, మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనితో ఇక మీ సెల్ ఫోన్ సేఫ్.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments