Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్... జియోకు ధీటుగా

దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (18:23 IST)
దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్ మేరకు... కేవలం రూ.345 రిచార్జ్‌తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జిబి డాటా, అపరిమిత లోకల్, నేషనల్ ఫోన్‌కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే 1 జిబి డాటాను పగలు 500 ఎంబీలు, రాత్రి సమయంలో 500 ఎంబీల చొప్పున వినియోగించుకునే పరిమితిని విధించింది. 
 
ఈ ఆఫర్‌ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్‌ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్‌‌కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం. 
 
అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments