Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబిలో జియో జెండా.. ముబాదలాకు రూ.9003 కోట్ల షేర్లు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:59 IST)
రిలయన్స్ జియో సంస్థ అబుదాబిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా అబుదాబికి చెందిన ముబాదలా సంస్థ జియోకు చెందిన వాటాలను కొనుగోలు చేసింది. ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగివుంది. ఈ సంస్థకు చెందిన కొన్ని వాటాలను అంటే జియోకు చెందిన 9.99% వాటాలు, 5.7 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. 
 
భారత్ కరెన్సీ విలువ ప్రకారం రూ.43,574 కోట్లు. ఆపై అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ జియోకు చెందిన ఒక శాతం షేర్లను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.5,655.75 కోట్లు. ఈ ఒప్పందానికి తర్నాత రిలయన్స్ జియో తన 2.3 శాతం షేర్లను అమెరికా టెక్నాలజీ సంస్థ అయిన విస్టాకు విక్రయించింది. దీని విలువ రూ.11,367 కోట్లు. తద్వారా జియో సంస్థ రూ.60596.37 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 
 
ప్రస్తుతం అబుదాబికి చెందిన ప్రముఖ సంస్థ ముబాదాలా కూడా జియో వాటాలను కొనుగోలు చేసింది. జియోకు చెందిన 1.85శాతానికి చెందిన వాటాలను రూ.9003 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా జియోకు చెందిన 18.97 శాతానికి చెందిన షేర్లను ఆరు అతిపెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments